జయరామన్, చందన జంటగా నటించిన ‘అనన్య’ చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకోవాలని హీరో శ్రీకాంత్ కోరారు. హర్రర్ నేపధ్యంలో కుటుంబ ప్రేమ కథా చిత్రంగా నిర్మితమైన ఈ సినిమా ఈనెల 22న విడుదల కానుంది. ప్రచార చిత్రాన్ని శ్రీకాంత్ ఆవిష్కరించి మాట్లాడారు. నిర్మాత జంధ్యాల ఉమా నాగ శివ గంగాధర శర్మ మాట్లాడుతూ, ఏలూరు, జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంతాల్లో ఈ సినిమా షూటింగ్ జరిగిందన్నారు. శ్రీ సిద్ధి ధాత్రి మూవీ క్రియేషన్స్‌పై నిర్మించిన ఈ చిత్రాన్ని ప్రేక్షకులకు నచ్చేలా తీశామన్నారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు రాజు బమ్మిడి తదితరులు పాల్గన్నారు.
