నార్నే నితిన్ హీరోగా తెరకెక్కిన ‘ఆయ్’ చిత్రం నుండి ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది. ప్రతిష్టాత్మక సంస్థ గీతా ఆర్ట్స్-2 పిక్చర్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెం.9గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని అంజి కంచిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. నయన్ సారిక హీరోయిన్‌గా నటిస్తున్నారు. బన్నీ, విద్యా కొప్పినీడి నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తయి, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. తాజాగా ఈ చిత్ర ఫస్ట్ లుక్‌ను చిత్రబృందం విడుదల చేసింది. రాజ్ కుమార్ కసిరెడ్డి, అంకిత్ హీరో ఫ్రెండ్స్ పాత్రల్లో కనిపిస్తున్నారు. ఈ మూవీని వేసవిలో విడుదల చేస్తామని చిత్రబృందం ఇప్పటికే ప్రకటించింది.
