‘మళ్లీ కుటుంబ కథా చిత్రాల్లో నటించాలని ఉంది. పెద్దగా నటన గురించి తెలియకుండానే సినిమాల్లోకి వచ్చాను. కూచిపూడి డ్యాన్స్ నేర్చుకున్న తర్వాత కొన్ని ఫొటోషూట్స్ చేశాను. ఫొటోస్ చూసి కొన్ని సినిమాల్లో ఆఫర్స్ ఇస్తామంటూ సంప్రదించారు. గతంలో నేను నటించిన పెళ్లాం ఊరెళితే, ఇంద్ర సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి’ అని సినీ నటి ప్రశాంతి హారతి అన్నారు. వివాహం తర్వాత ఆమె అమెరికాలో స్థిరపడ్డారు. విరామం అనంతరం శ్రీనివాసరెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఫిబ్రవరి 14 నెక్లెస్‌రోడ్డు, మణిశర్మ నిర్మించిన రూపాయి సినిమాల్లో నటించారు. బాలాజీ టెలీ ఫిలింస్ వారి సీరియల్స్‌లో నటించే అవకాశం కూడా వచ్చిందని, మరిన్ని సినిమాల్లో నటించాలని ఉందని ఆమె విలేకరులతో అన్నారు.
