కొత్తపార్టీ యోచనలో విశాల్‌?

Feb 7,2024 08:22 #movie, #vishal

కోలీవుడ్‌ హీరో దళపతి ఇటీవల రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ‘తమిళ వెట్రి కళగం’ పేరుతో తన రాజకీయ పార్టీని కూడా ప్రకటించిన విషయం తెలిసిందే. విజరుబాటలోనే హీరో విశాల్‌ కూడా రాజకీయాల్లోకి రంగ ప్రవేశం చేయబోతున్నారని తమిళనాడులో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఆయన పార్టీ ఏర్పాటుకు సంబంధించిన సన్నాహాలు సైతం ప్రారంభించినట్లుగా సమాచారం. 2026లో వచ్చే అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా త్వరలోనే పార్టీని పెట్టబోతున్నట్లుగా గతంలోనే ఆయన ప్రకటించిన విషయం తెలిసిందే. గతంలో చెన్నై ఆర్కే నగర్‌ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ఆయన పోటీ చేసేందుకు నామినేషన్‌ కూడా వేశారు. అయితే ఆ నామినేషన్‌ కొన్ని కారణాలతో తిరస్కరణకు గురైంది. తాజాగా రాజకీయరంగ ప్రవేశానికి రంగం సిద్ధమవుతున్నట్లుగా తమిళనాడులో పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. ఇప్పటికే ఆయన పలు సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు.

➡️