నిహారిక కొణిదెల హీరోయిన్‌గా ఓ తమిళ సినిమా తెరకెక్కుతోంది. ఇది వరకే విజరు సేతుపతితో ఆమె ఓ సినిమా చేశారు. ఇప్పుడు ఆర్ డి ఎక్స్ నటుడు షేన్ నిగమ్ కోలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న చిత్రంలో నిహారిక నటిస్తున్నారు. ‘మద్రాస్ కారన్’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌ని సెట్ చేసుకున్న ఈ చిత్రం ఇటీవల ముహూర్త కార్యక్రమాలతో మొదలైంది. ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించారు. ఈ చిత్రాన్ని ”సీమరాజా”, ”వీవీఎస్” ఫేమ్ దర్శకుడు పొన్రం వీవీఎస్ తెరకెక్కిస్తున్నారు. సామ్ సి ఎస్ సంగీతం అందిస్తున్నారు. ఎస్ ఆర్ ప్రొడక్షన్స్ నిర్మాణం వహిస్తున్నారు.
