చిరంజీవికి ఘన సత్కారం

Mar 23,2024 19:20 #allu aravind, #movie

వేడుకగా సౌత్‌ ఇండియా ఫిలిం ఫెస్టివల్‌

పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ, ఆహా సంస్థలు సంయుక్తంగా 9వ సౌత్‌ ఇండియా ఫిలిం ఫెస్టివల్‌ని హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించాయి. హీరో చిరంజీవి ఈ వేడుకకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. దేశంలోనే రెండో అత్యున్నత పురస్కారం పద్మవిభూష్‌ వచ్చినందుకుగాను సినీ ప్రముఖులు చిరంజీవిని ఘనంగా సత్కరించారు. ఆంజనేయ ప్రతిమను మురళీమోహన్‌, అల్లు అరవింద్‌, టీజీ విశ్వప్రసాద్‌ అందజేశారు. ఈ సందర్భంగా అల్లు అరవింద్‌ మాట్లాడుతూ పవన్‌ కళ్యాణ్‌ నుంచి అల్లు శిరీష్‌ వరకూ ఇండిస్టీకి రావటానికి చిరంజీవి కారణమన్నారు. అందరూ ఆయన బాటలో నడుస్తూ కెరీర్‌ను నిర్మించుకున్నారన్నారు. చిరంజీవి తన కెరీర్‌, ఎదుర్కొన్న సవాళ్లు గురించి వివరించారు. ఈ సందర్భంగా జరిగిన చర్చావేదికలో సినీ ప్రముఖులు, విమర్శకులు, విశ్లేషకులు పాల్గన్నారు. నిర్మాత స్వప్నదత్‌, ఎస్‌కేఎన్‌, సుస్మితా కొణిదెల, ఆనంద్‌ దేవరకొండ తదితరులు పాల్గని తమ చిత్రాల విశేషాలను పంచుకున్నారు. సినీరంగంలో వస్తోన్న మార్పులపై అభిప్రాయాలు తెలిపారు. యువనటీనటులు సందడి చేశారు. తేజా సజ్జా డ్యాన్స్‌తో అలరించారు. ఈ కార్యక్రమాల్లో మణిశర్మ, తనికెళ్ల భరణి, కెఎస్‌ రామారావు, మంచు లక్ష్మి, టీజీ వెంకటేష్‌తోపాటుగా పలు భాషలకు చెందిన సినీ ప్రముఖులు పాల్గొన్నారు.

➡️