తెరపైకి మళ్లీ ‘తారే జమీనే’ కాంబో

Mar 6,2024 08:11 #ameer khan, #movie

బాలీవుడ్‌ నటుడు అమీర్‌ ఖాన్‌ కొంతకాలంగా ఏ సినిమాల ప్రకటన చేయలేదు. తాజాగా ఆయన కొత్త ప్రాజెక్ట్‌కి సంబంధించిన ఓ ఫొటో ఒకటి బయటకు వచ్చింది. ఈ ప్రాజెక్ట్‌ కోసం 16 ఏళ్ళ కాంబినేషన్‌ని.. అమీర్‌ ఇప్పుడు మళ్ళీ రిపీట్‌ చేస్తున్నారు. 2007లో విడుదలైన ‘తారే జమీన్‌’ చిత్రంలో నటించిన ఎనిమిదేళ్ల బాలుడు ‘దార్శీల్‌ సఫారీ’తో కలిసి ఆయన స్క్రీన్‌ పంచుకోనున్నారు. ఈ రీ యూనియన్‌ గురించి దార్శీల్‌ ఒక పోస్ట్‌ చేశారు.. ’16 ఏళ్ళ తరువాత మళ్ళీ ఇప్పుడు కలిసి నటించబోతున్నాం. ఎమోషనల్‌గా ఉంది. మరో నాలుగు రోజుల్లో దీనికి సంబంధించిన అనౌన్స్‌మెంట్‌ రాబోతుంది. ఎదురు చూస్తూ ఉండండి’ అని దార్శీల్‌ తన ఇన్‌స్టాలో రాసుకొచ్చారు.

➡️