హీరో సిద్ధు జన్నలగడ్డ నటించిన తాజా చిత్రం డిజె టిల్లు మార్చి 29న విడుదల కానుంది. డిజె టిల్లుకు సీక్వెల్‌గా ఈసినిమా తీస్తున్న విషయం తెలిసిందే. రామ్ మిరియాల స్వరపర్చిన టికెట్టే కొనకుండా, రాధిక వంటి పాటలను చిత్రబృందం ఇప్పటికే విడుదలచేసిన విషయం తెలిసిందే. తొలుత ఫిబ్రవరి 9న ఈ సినిమా విడుదల అవుతుందని చిత్ర నిర్మాతలు ప్రకటించారు. మరికొన్ని సినిమాలు అదేరోజు విడుదల కానుండటంతో మార్చి 28కి విడుదల చేయాలని నిర్ణయించారు. అనుపమ పరమేశ్వరన్ కథానాయిక. మల్లిక్‌రామ్ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకరా స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర వంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
