మురుగుదాస్, శివకార్తికేయన్ కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కుతోంది. గురువారం చిత్ర షూటింగ్ ప్రారంభమైంది. ఈ విషయాన్ని మురుగదాస్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఈ చిత్రంలో శివ కార్తికేయన్‌కి జంటగా ‘సప్త సాగరాలు దాటి’ హీరోయిన్ రుక్మిణి వసంత్ నటిస్తున్నారు. అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. శ్రీ లక్ష్మీ మూవీస్ సంస్థ భారీ ఎత్తున ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. మిగతా నటీనటులు, సాంకేతిక నిపుణుల గురించి త్వరలో ప్రకటించనున్నారు.
