అరవింద్ కృష్ణ, బిగ్ బాస్ ఫేమ్ దివి, మేఘన శ్రీనివాస్, వినరు కీలక పాత్రల్లో నటించిన కొత్త చిత్రం ‘1000 వర్డ్స్’. ఈ సినిమాకు రమణ విల్లర్ట్ నిర్మాతగా వ్యవహరిస్తూ డైరెక్షన్ చేశారు. కే రవి కృష్ణా రెడ్డి కో- ప్రొడ్యూసర్‌గా పని చేశారు. ఈ సినిమాకు డా.సంకల్ప్ కథ, డైలాగ్స్, స్క్రీన్ ప్లే అందించగా.. శివ కృష్ణ సంగీతం అందించారు. తాజాగా చిత్రబృందం ఏర్పాటు చేసిన ఈ సినిమా ప్రత్యేక ప్రదర్శనకి రేణూ దేశాయ్, ఎస్వీ కృష్ణారెడ్డి, అచ్చి రెడ్డి, మధుర శ్రీధర్, జ్యోతి పూర్వాజ్, ముఖ్య అతిథులుగా విచ్చేశారు. షో అనంతరం రేణూ దేశాయ్ మాట్లాడుతూ ‘ఈ మూవీ అద్భుతంగా అనిపించింది. ఇది అందరికీ రీచ్ అవ్వాలి. అందరూ చూడాల్సిన, అందరికీ తెలియాల్సిన సినిమా. ఒక్క ఫోటో మీద ఇంత మంచి కథను రాసుకుని తీశారు. సినిమా చూశాక నాకు కన్నీళ్లు వచ్చాయి. ఇంత మంచి సినిమా తీసిన టీమ్‌కు ఆల్ ది బెస్ట్. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరు కుంటున్నాను’ అన్నారు. ఎస్వీ కష్ణారెడ్డి మాట్లాడుతూ.. ‘1000 వర్డ్స్’ అద్భుతమైన చిత్రం. అందరినీ కంటతడి పెట్టించారు. ఈ చిత్రానికి కచ్చితంగా అవార్డులు వస్తాయి. ప్రతీ ఒక్కరి హృదయాల్ని కుదిపేస్తుంది. చాలా రోజులకు ఓ చక్కటి సినిమాను చూశానని అనిపిస్తుంది’ అని అన్నారు.