19న ‘లవ్‌, మౌళి’ విడుదల

Apr 2,2024 19:05 #movie, #navadeep

హీరో నవదీప్‌ 2.0గా కనిపించబోతున్న చిత్రం ‘లవ్‌, మౌళి’. కొంత విరామం తర్వాత ఆయన నటించిన చిత్రం ఇది. అవనీంద్ర దర్శకత్వంలో నైనా క్రియేషన్స్‌, శ్రీకర స్టూడియోస్‌ బ్యానర్లపై సి స్పేస్‌ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ చిత్రంలో నవదీప్‌ చాలా డిఫరెంట్‌గా కన్పిస్తారని, అందుకే నవదీప్‌ 2.0గా పిలుస్తామని దర్శకుడు అవనీంద్ర అన్నారు. ప్రేమకు సంబంధించిన తన స్వీయ అనుభవాలే ఈ సినిమా కనిపిస్తాయని చెప్పారు. భిన్న ప్రేమకథలను కోరుకునే ప్రేక్షకులకు ‘లవ్‌, మౌళి’ మనసుకు హత్తుకుంటుందని చెప్పారు.

➡️