1940 బ్యాక్‌ డ్రాప్‌లో …

Jan 11,2025 20:58 #1940, #back drop, #movies

ప్రభాస్‌ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో ‘ఫౌజీ’ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పాన్‌ ఇండియా లెవల్లో ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. సీతారామం వంటి బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ తర్వాత హను రాఘవపూడి టేకప్‌ చేస్తున్న ప్రాజెక్ట్‌ ఇది. తాజాగా ఈ సినిమా గురించి రచయిత కృష్ణకాంత్‌ కొన్ని ఆసకిర్తకర విషయాలను పంచుకున్నారు. ‘కథ, కథనాల పరంగా ఈ సినిమా హాలీవుడ్‌ రేంజ్‌ చిత్రం. అందులో ఎలాంటి సందేహం లేదు. ఊహించని విధంగా సినిమా ఉంటుంది. ఈ కథ పూర్తిగా 1940 బ్యాక్‌ డ్రాప్‌లో కొనసాగుతుంది. హను మార్క్‌ లవ్‌ స్టోరీతో పాటు, డ్రామా, భారీ యాక్షన్‌ సన్నివేశాలూ ఉంటాయి. ఇదంతా దేశ భక్తి అంశాలతో మిళితమై ఉంటుంది’ అన్నారు.

➡️