వడివేలు, ప్రభుదేవా 2001 తరువాత కలసి నటించలేదు. తాజాగా వీరి కాంబోలో ఓ చిత్రం రానుంది. 23 ఏళ్ల తరువాత పొన్రామ్ దర్శకత్వంలో వీరిద్దరూ కలసి నటించనున్నారు. ‘లైఫ్ ఈజ్ బ్యూటిపుల్’ టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీత దర్శకుడు. ఇతర నటీనటులు, సాంకేతిక వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి.
