80 శాతం ‘ఆ రోజు ఏం జరిగిందంటే..’ పూర్తి

Jan 7,2025 17:05 #movies, #Poster release

శ్రీ స్వర్ణ వరల్డ్‌ మూవీస్‌ బ్యానర్‌పై బి.నాగవర్థనీ సమర్పణలో మూర్తీ నంబర్‌ వన్‌ ద్విపాత్రాభినయంలో వస్తున్న సినిమా ‘ఆరోజు ఏం జరిగిందంటే’. ఇప్పటికే 80 శాతం సినిమా షూటింగ్‌ పూర్తయ్యింది. తుది షెడ్యూల్‌ను కూడా తెరకెక్కించేందుకు చిత్ర యూనిట్‌ ఏర్పాట్లు చేస్తోంది. సంక్రాంతి తర్వాత మిగతా పార్టు పూర్తిచేస్తామని దర్శకుడు మూర్తి తెలిపారు. కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం మూర్తి బాందేపురపు. నిర్మాత ఎం.మల్లిబాబు. సంగీతం చదివే దేవేంద్ర, కొరియోగ్రఫీ శేఖర్‌, ఎడిటింగ్‌ అవినాష్‌. డిఒపి యోగి రమేష్‌ యాదగిరి. ప్రస్తుత యువత చదువుకునే రోజుల్లో చేసే టేకీటీజీ ప్రేమలు, ఎంజారు చేయటం, ఆ తర్వాత మరొకరిని పెళ్లిచేసుకోవటం వంటి అంశాలను ఇతివృత్తంగా చేసుకుని తెరకెక్కుతున్న చిత్రమిది.

➡️