- త్వరలో పాటలు, ట్రైలర్ విడుదల : నిర్మాత ట్వీట్
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఇప్పటికే ప్రకటించిన ‘హరిహర వీరమల్లు’ పార్ట్ 1 సినిమా చిత్రీకరణ పూర్తయింది. త్వరలోనే పాటలు, ట్రైలర్ విడుదల చేస్తామని నిర్మాత ఎఎం రత్నం తెలిపారు. ఆఖరి షెడ్యూల్‌లో.. రెండు రోజులపాటు పవన్ కల్యాణ్ షూటింగ్‌లో పాల్గొన్నారు. ”చిత్రీకరణ పూర్తయింది. ఇక థియేటర్లలో విడుదల కావడమే తరువాయి. బ్లాక్‌బస్టర్ సాంగ్స్, అదిరిపోయే ట్రైలర్ త్వరలో విడుదలవుతాయి” అని నిర్మాత సోషల్ మీడియాలో తెలిపారు. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ చిత్రాన్ని మే 9న విడుదల చేస్తున్నామంటూ కొన్ని రోజుల క్రితం టీమ్ ప్రకటించింది. కొంత షూటింగ్ మిగిలి ఉండడంతో మరోసారి వాయిదా వేసింది. కొత్త విడుదల తేదీ వివరాలు త్వరలో వెల్లడించనున్నారు. ఇప్పటికే రీ రికార్డింగ్, డబ్బింగ్, విఎఫ్‌ఎక్స్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.