ఈనెల పదోతేదీన విడుదల కానున్న ‘గేమ్ చేంజర్’కు ఎపి ప్రభుత్వం అన్ని రకాలుగా సాయం అందించనున్నట్లు ప్రక టించింది. అయితే తెలంగాణలో బెనిఫిట్ షోలకు అనుమతివ్వలేదు కానీ.. టికెట్ల ధర పెంచుకోవచ్చంటూ కొన్ని నిబంధనలతో తెలంగాణ ప్రభుత్వం జిఒ విడుదల చేసింది. ఈ సినిమాకు జనవరి పదో తేదీ ఒక్కరోజు మాత్రమే ఉదయం నాలుగు గంటల నుంచి ఆరు షోలకు అనుమతిచ్చిన ప్రభుత్వం, జనవరి 11 నుంచి జనవరి 19వ తేదీ వరకు 9 రోజుల పాటు 5 షోలకు అనుమతిచ్చింది. జనవరి పదో తేదీన నిర్వహించే ఆరు షోలకు టికెట్ల ధరలను పెంచుకునే వెసులుబాటును కల్పించింది. ఆ ఒక్క రోజు మల్టీప్టెక్స్ థియే టర్లలో రూ.150, సింగిల్ స్క్రీన్ థియే టర్లలో రూ.100 పెంచుకునేందుకు అనుమతి జారీ చేసింది. జనవరి 11 నుండి జనవరి 19 వరకు 9 రోజుల పాటు సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.50, మల్టీఫ్లెక్స్ థియేటర్లలో రూ.100 పెంచు కునేలా వెసులుబాటుని కల్పించిన ప్రభు త్వం.. బెనిఫిట్ షోలకు మాత్రం అనుమతి వ్వలేదు. అయితే ఈ సినిమాకు ఎపిలో టికెట్ల ధరలు, బెనిఫిట్ షోలకు అనుమతి లభించింది. టికెట్ల ధరలు పెంచుకునే వెసులుబాటును ప్రభుత్వం కల్పించడంతో ఫ్యాన్స్ గందరగోళానికి గురవుతున్నారు. వాస్తవానికి ‘పుష్ప 2’ సంధ్య థియేటర్ ఘటన తర్వాత టికెట్ల ధర పెంచడం కానీ, బెనిఫిట్ షోలు ఉండవని తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి ఖరాఖండీగా చెప్పినా.. భారీ బడ్జెట్ సినిమా కావడంతో పాటు, ఎఫ్‌డిసి ఛైర్మన్ వినతి మేరకు టికెట్ల ధరలను పెంచు కునే వెసులుబాటుని ప్రభుత్వం కల్పించింది.