డిసెంబర్‌ 20న ‘గేమ్‌ ఛేంజర్‌’

హీరో రామ్‌చరణ్‌, హీరోయిన్‌ కియారా అద్వానీ నటించిన చిత్రం ‘గేమ్‌ఛేంజర్‌’. శంకర్‌ దర్శకత్వంలో పొలిటికల్‌ యాక్షన్‌ డ్రామాగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ ఏడాది క్రిస్మస్‌ సందర్భంగా ఈ సినిమా విడుదల చేస్తామని గతంలో నిర్మాత దిల్‌రాజు ప్రకటించారు.కానీ విడుదల తేదీపై స్పష్టత ఇవ్వలేదు. తాజాగా మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఇచ్చిన హింట్‌తో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. వచ్చే వారం నుంచే గేమ్‌ఛేంజర్‌కు సంబంధించిన అన్‌స్టాపబుల్‌ ఈవెంట్స్‌ డిసెంబర్‌ 20 వరకూ జరుగుతాయని పోస్ట్‌చేశారు. దీంతో అదేరోజున సినిమా విడుదలవుతుందని అభిమానులు భావిస్తున్నారు. ఈ చిత్రంలో శ్రీకాంత్‌, ఎస్‌జే సూర్య, అంజలి, నవీన్‌ చంద్ర కీలకపాత్రల్లో నటించారు. గేమ్‌ఛేంజర్‌ సినిమా షూటింగ్‌ పూర్తికావటంతో రామ్‌చరణ్‌ తరువాత సినిమా నటించడానికి సిద్ధమవుతున్నారు. బుచ్చిబాబు సనా డైరెక్షన్‌లో నటించే ఈ సినిమాలో బాలీవుడ్‌ హీరోయిన్‌ జాన్వీకపూర్‌ నటిస్తున్నారు. ఇటీవల ఈ మూవీకోసం ఫిట్‌నెస్‌ ట్రైనర్‌ శివోహంతో కలిసి కసరత్తులు చేస్తున్నట్లు ట్విట్టర్‌లో పోస్టుచేశారు.

➡️