నేచురల్ స్టార్ నాని, మృణాల్‌ఠాకూర్, కియారా ఖన్నా ప్రధాన పాత్రలో నటించిన సూపర్‌హిట్ మూవీ ‘హాయ్ నాన్న’. గతేడాది థియేటర్లలో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్‌హిట్‌గా నిలిచింది. శౌర్యువ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ‘సలార్’ పోటీని తట్టుకుని ప్రపంచవ్యాప్తంగా రూ.75 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది. తాజాగా మెక్సిలో జరిగిన ఐఎఫ్‌ఎసి ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఏకంగా ఆరు అవార్డులను సొంతం చేసుకుంది. బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ స్కోర్, బెస్ట్ రైటర్, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ సెట్ డిజైన్, బెస్ట్ హెయిర్ అండ్ మేకప్ ఫీచర్ సౌండ్, బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ సౌండ్ విభాగాల్లో అవార్డులను దక్కించు కుంది. తండ్రీ కూతుళ్ల ఎమోషనల్ చిత్రంగా ‘హాయ్ నాన్న’ సినిమా తెరకెక్కించారు. గతంలో న్యూయార్క్‌లో జరిగిన ‘ది ఓనిరోస్ ఫిల్మ్ అవార్డు’ల్లోనూ సత్తా చాటింది. పలు విభాగాల్లో మొత్తం 11 అవార్డులను కైవసం చేసుకుంది. ఏథెన్స్ ఇంటర్నేషనల్ ఆర్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ మార్చ్-2024 ఎడిషన్‌లో బెస్ట్ ఫీచర్ ఫిల్మింగ్ అవార్డును కైవసం చేసుకుంది.