‘ఆ పిల్ల కనులే..’ పాట విడుదల

May 14,2024 19:20

అల్లు శిరీష్‌ హీరోగా నటిస్తున్న తాజా సినిమా ‘బడ్డీ’. గాయత్రి భరద్వాజ్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. యూత్‌ ఫుల్‌ లవ్‌ ఎంటర్‌ టైనర్‌గా తెరకెక్కుతోంది. ‘ఆ పిల్ల కనులే..’ అంటూ సాగే ఫస్ట్‌ సింగిల్‌ను మంగళవారం విడుదల చేశారు. ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్‌ ఫిలింస్‌ బ్యానర్‌ పై కేఈ జ్ఞానవేల్‌ రాజా, అధన జ్ఞానవేల్‌ రాజా నిర్మిస్తున్నారు. శామ్‌ ఆంటోన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. నేహ జ్ఞానవేల్‌ రాజా కో ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. హిప్‌ హాప్‌ తమీజా సంగీతాన్ని అందించారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే థియేటర్లలోకి రానుంది.

➡️