యాక్షన్‌ కింగ్‌ హీరో అర్జున్‌ ఇంట పెళ్లి సందడి

అమరావతి : యాక్షన్‌ కింగ్‌ హీరో అర్జున్‌ ఇంట పెళ్లి సందడి మొదలయ్యింది. ఆయన కుమార్తె, హీరోయిన్‌ ఐశ్వర్య హల్దీ, మెహందీ వేడుకలతో పెళ్లి వేడుకలు జోరందుకున్నాయి. వీటికి సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అర్జున్‌ కుమార్తె ఐశ్వర్య వివాహం నటుడు ఉమాపతి రామయ్య తో జూన్‌ 10న చెన్నైలోని హనుమాన్‌ ఆలయంలో జరగనుంది. వీరిది లవ్‌ మ్యారేజ్‌. గతేడాది అక్టోబర్‌లో ఎంగేజ్‌ మెంట్‌ జరిగింది. చెన్నైలోని అర్జున్‌ నివాసంలో హల్దీ, మెహందీ, సంగీత్‌ వేడుకలను నిర్వహించారు. సంగీత్‌కు హాజరైన హీరో విశాల్‌.. అక్కడ దిగిన స్టిల్స్‌ను సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. అర్జున్‌ ఫ్యామిలీతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.

➡️