హైదరాబాద్ : తనపై దర్శకుడు త్రినాథరావు చేసిన కామెంట్స్ పై నటి అన్షు స్పందించారు. సోషల్ మీడియా వేదికగా ఆమె మాట్లాడారు. ”త్రినాథరావు చేసిన వ్యాఖ్యలపై చర్చ జరిగిందని తెలిసింది. ఆయనెంత మంచి వారో చెప్పేందుకే ఈ వీడియో. ఆయన ఎంతో స్నేహంగా ఉంటారు. నన్ను తన కుటుంబ సభ్యురాలిగా భావించారు. ఆయనపై నాకు గౌరవం ఉంది. టాలీవుడ్‌లో నా సెకండ్ ఇన్నింగ్స్‌కు ఇంత కంటే మంచి దర్శకుడు ఉండరేమో” అని తెలిపారు. కామెంట్స్ విషయమై డిబేట్‌కు ఫుల్‌స్టాప్ పెట్టాలని కోరారు. తెలుగు ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ‘మజాకా’ విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నానన్నారు. సందీప్ కిషన్ హీరోగా త్రినాథరావు తెరకెక్కిస్తున్న ‘మజాకా’లో అన్షు కీలక పాత్ర పోషించారు. హైదరాబాద్‌లో ఆదివారం సాయంత్రం నిర్వహించిన టీజర్ లాంచ్ ఈవెంట్‌లో అన్షు శరీరాకఅతి గురించి దర్శకుడు మాట్లాడడం చర్చనీయాంశమైంది. దానిపై స్పందించిన త్రినాథరావు.. అన్షుకు క్షమాపణలు చెప్పారు. లండన్‌కు చెందిన అన్షు ‘మన్మథుడు’లోని మహేశ్వరి పాత్రతో తొలి ప్రయత్నంలోనే ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. తర్వాత, ‘రాఘవేంద్ర’, ‘మిస్సమ్మ’ చిత్రాల్లో అతిథి పాత్రలు పోషించిన ఆమె తమిళ సినిమా ‘జై’లోనూ హీరోయిన్‌గా మెరిశారు. పెళ్లి అనంతరం నటనకు దూరంగా ఉన్నారు. దాదాపు 20 ఏళ్ల తర్వాత ‘మజాకా’తో ప్రేక్షకులను పలకరించనున్నారు. ఈ చిత్రం ఫిబ్రవరి 21 న విడుదల కానుంది.
