నటి నూర్‌ మాళవికా దాస్‌ ఆత్మహత్య

ముంబయి : డిస్నీ ప్లస్‌ హాట్‌ స్టార్‌ సిరీస్‌ ది ట్రయల్‌ నటి నూర్‌ మాళవికా దాస్‌ (32) ఆత్మహత్యకు పాల్పడ్డారు. ముంబయిలోని ఆమె అపార్ట్‌మెంట్‌ నుంచి దుర్వాసన వస్తోందని పొరుగింటివారు పోలీసులకు సమాచారం అందించారు. మాళవికా దాస్‌ ఫ్లాట్‌ నుంచి ఆమె మఅతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అసోంకు చెందిన నటి మాళవికా దాస్‌ నటి కాకమునుపు ఖతార్‌ ఎయిర్‌వేస్‌లో ఎయిర్‌ హోస్టెస్‌గా పనిచేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

➡️