ముంబయి : బాలీవుడ్ నటి రకుల్ ప్రీత్ సింగ్ తమ్ముడు అమన్ ప్రీత్ సింగ్ డ్రగ్స్ కేసులో అరెస్టయ్యారు. డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు ముంబై నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ఒక గ్యాంగ్‌ను పోలీసులు తనిఖీ చేశారు. అమన్ ప్రీత్ సింగ్ దగ్గర సుమారు 200 గ్రాముల కొకైన్ కూడా పోలీసులు గుర్తించి దానిని సీజ్ చేశారు. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, ఎస్వోటీ పోలీసులు, రాజేంద్రనగర్ డివిజన్ పోలీసులు మొత్తంగా మూడు పోలీస్ టీమ్స్ కలిసి చేసిన ఉమ్మడి ఆపరేషన్ లో భాగంగా డ్రగ్స్ విక్రయిస్తున్న ఐదుగురు నైజీరియన్లను అరెస్టు చేశారు. పలువురు విఐపిలకు వీరు డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు అనుమానం వ్యక్తం అవుతుంది. ఐదుగురు నైజీరియన్ ల వద్ద కొకైన్ కొనుగోలు చేసిన ఐదుగురు వీఐపీలను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. వారిలో రకుల్ ప్రీత్ సింగ్ తమ్ముడు ఒకరు. రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన అమన్ ప్రీత్ సింగ్ ఒక సినిమాలో హీరోగా కూడా నటించాడు. అయితే ఈ డ్రగ్స్ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు మాత్రం పోలీసులు వెల్లడించలేదు.
