మలయాళ ఇండిస్ట్రీలో హేమ కమిటీ నివేదికపై టాలీవుడ్ నటి శాంతిప్రియ స్పందించారు. ఇలాంటి వేధింపులు కేవలం మాలీవుడ్, బాలీవుడ్ మాత్రమే కాదు. అన్ని చోట్లా జరుగుతున్నాయన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండేలా పటిష్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. మన భవిష్యత్తు తరాలకు భరోసానిచ్చేలా చర్యలు ఉండాలని సూచించారు. మలయాలం మూవీ ఆర్టిస్ట్‌ల సంఘం అధ్యక్ష పదవికి మోహన్‌లాల్ రాజీనామా చేయటం ఏమాత్రం సమంజసం కాదన్నారు. హేమ కమిటీ నివేదిక తర్వాత ఆరోపణలు వస్తున్న సమయంలో తప్పుకోవటడం సరైన నిర్ణయం కాదన్నారు. బాధితులకు న్యాయం చేసేందుకు అండగా నిలబడాలని సూచించారు. బాధితులకు భరోసా కల్పించే బాధ్యత ‘అమ్మ’ సమస్యలపై ఉందని గుర్తుచేశారు. తనకు ఇలాంటి పరిస్థితులెప్పుడూ ఎదురుకాలేదన్నారు. భానుప్రియ సోదరురాలిని కావటం వల్ల తనను ఎవ్వరూ టచ్‌చేయలేదన్నారు.
