Adam Somner : ఆస్కార్‌ నామినేటెడ్‌ నిర్మాత ఆడమ్‌ సోమ్నర్‌ కన్నుమూత

వాషింగ్టన్‌ : ఆస్కార్‌ అవార్డుకు నామినేట్‌ అయిన నిర్మాత ఆడమ్‌ సోమ్నర్‌ (57) కన్నుమూశారు. ఈయన గత కొంతకాలంగా థైరాయిడ్‌ క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. లాస్‌ ఏంజెల్స్‌లో స్టూడియో సిటిలో బుధవారం కన్నుమూశారు. ఈయన లియోనార్డో డికాప్రియో నటించిన రాబోయే చిత్రం ‘వార్నర్‌ బ్రదర్స్‌’ మూవీకి నిర్మాతగానూ, అసిస్టెంట్‌ డైరెక్టర్‌గానూ పనిచేశారు.
కాగా, ఆయన 2021లో విడుదలైన అమెరికన్‌ రొమాంటిక్‌ కామెడీ చిత్రమైన ‘లైకోరైస్‌ పిజ్జా’ అనే చిత్ర నిర్మాతల్లో ఒకరు. ఈ చిత్రం ఉత్తమ చిత్రంగా ఆస్కార్‌ నామినేషన్‌కు ఎంపికైంది.

➡️