ఆదిత్య ఓం ప్రస్తుతం ‘బందీ’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ మూవీలో ప్రకృతిని నాశనం చేస్తున్న కార్పొరేట్ కంపెనీలకు మద్దతుగా నిలిచే పాత్రలో ఆదిత్య ఓం కనిపించ నున్నాడు. కార్పొరేట్ కంపెనీలకు న్యాయ సలహాదారుగా వ్యవహరించే పాత్రను పోషిస్తు న్నాడు. అతడిని అడవిలో వదిలేస్తే ఏం జరుగు తుంది? అతడు ప్రకృతిని ఎలా కాపాడతాడనే కాన్సెప్ట్‌తో సినిమా ఆసక్తికరంగా ఉండబోతుం దని మేకర్స్ తెలిపారు. ఆదిత్య ఓం ఈ సినిమాలో ఎలాంటి డూప్స్ లేకుండా సొంతంగా యాక్షన్ సీక్వెన్స్‌లో కనిపిస్తారని తెలిపారు. తిరుమల రఘు దర్శకత్వంలో ఈ సినిమాను గల్లీ సినిమా బ్యానర్‌పై వెంకటేశ్వర రావు దగ్గు, తిరుమల రఘు నిర్మిస్తున్నారు.