హాలీవుడ్ మూవీ ‘పాడింగ్టన్ ఇన్ పెరూ’ భారతదేశంలో ఈనెల 17న విడుదల కానుంది. వివిధ భాషల్లో ఈ సినిమా తాజా ట్రైలర్ విడుదలై ఆకట్టుకుంటోంది. ఇందులో అందరికీ ఇష్టమైన ఎలుగుబంటి పెరూ అడవుల గుండా తన గొప్ప సాహసయాత్రకు బయలుదేరినట్లు కనిపిస్తుంది. ఈ సిరీస్‌లో ఇది మూడోభాగం. ఇందులో సాహసం, రహస్యాలతో నిండివుంది. ప్రేమగల ఎలుగుబంటి అత్త లూసీ, ఎల్ డొరాడోలను వెతుకుతూ ప్రమాదకరమైన అడవులు, నదులు, పురాతన శిథిలాల గుండా ప్రయాణిస్తుంది. డౌగల్ విల్సన్ దర్శకత్వం వహించారు. సోనీ పిక్చర్స్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇండియా ఈ సినిమాను విడుదల చేస్తోంది.
పాడింగ్టన్ ఇన్ పెరూ యొక్క తాజా ట్రైలర్ ఇక్కడ ఉంది