‘రొటీన్ కథలకు భిన్నంగా సరికొత్త కథతో మేము ప్రేక్షకుల ముందుకు వస్తున్నాం. యాక్షన్, కామెడీ, ప్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ‘1000 వాలా’ సినిమా తీశాం. ఒక సంకల్పంతో ఒక సాధన కోసం పల్లెటూరి యువకుడు పట్టణం వెళ్లాల్సి వస్తుంది. ఈ క్రమంలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలు పట్టి చూపించాం. మాస్, క్లాస్ ఎలిమెంట్లతోపాటుగా లవ్‌లీ కామెడీ మంచి ఎంటర్‌టైనర్‌గా సాగుతుంది. సగటు సామాన్య యువకుడు తాను ఎదుర్కొనే సమస్యలను ఎలా పరిష్కరించగలిగాడు’ అనే ఇతివృత్తంతో సినిమా సాగుతుంది. ఈ సినిమాలో నాలుగు పాటలున్నాయి. మంచి లొకేషన్లలో సరికొత్త హంగులతో చిత్రీకరించాం.’ అని దర్శకుడు అప్జల్ తెలిపారు. షారుఖ్ నిర్మాణంలో హీరోగా అమిత్ నటిస్తున్న చిత్రం ఇది. షారుఖ్, నవిత, కీర్తి, సుమన్, పిల్లా ప్రసాద్, ముఖ్తార్‌ఖాన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
