20 నుంచి ‘అక్కినేని కింగ్‌ ఆఫ్‌ ది సిల్వర్‌ స్క్రీన్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌’

ప్రముఖ నటుడు కీర్తిశేషులు అక్కినేని నాగేశ్వరరావు నటించిన కొన్ని క్లాసిక్‌ చిత్రాలు మళ్లీ థియేటర్లలో ప్రదర్శితం కానున్నాయి. ఈనెల 20న అక్కినేని నాగేశ్వరరావు 100వ జయంతిని పురస్కరించుకుని ఫిల్మ్‌ హెరిటేజ్‌ ఫౌండేషన్‌ ‘ఏయన్నార్‌ 100 ఆఫ్‌ ఫిల్మ్‌ హెరిటేజ్‌ ఫౌండేషన్‌ ‘ఏయన్నార్‌ 100 కింగ్‌ ఆఫ్‌ ది సిల్వర్‌ స్క్రీన్‌’ పేరుతో ఓ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ను ప్రకటించింది. హైదరాబాద్‌, ముంబై, ఢిల్లీ, చెన్నై, బెంగుళూరు వంటి మెట్రో నగరాలతోపాటుగా వరంగల్‌, కాకినాడ, తుముకూరు, వడోదల, జలంధర్‌, రూర్కెలా సహా 25 నగరాల్లో ఈనెల 20 నుంచి 22 వరకు 10 క్లాసిక్‌ చిత్రాలను ఈ ఫెస్టివల్‌లో ప్రదర్శించనున్నారు. ఈ సందర్భంగా హీరో నాగార్జున మాట్లాడుతూ ‘మా నాన్న 100వ జయంతిని దేశవ్యాప్తంగా ఆయన ల్యాండ్‌మార్క్‌ సినిమాల ఫెస్టివల్‌తో జరుపుకోనుండటం ఆనందంగా ఉందన్నారు. టాలీవుడ్‌లో తెలుగు చిత్ర పరిశ్రమకు తొలి పునాది వేసిన అన్నపూర్ణ స్టూడియోస్‌ను స్థాపించి మార్గదర్శకుడిగా నిలిచారన్నారు. ఆయన లెగసీని కొనసాగించటం తమకు గర్వకారణంగా ఉందన్నారు. ఈ పండుగను సాధ్యం చేయటంలో తమతో భాగస్వామ్యం అయినందుకు అక్కినేని కుటుంబం మొత్తం ఎన్‌ఎఫ్‌డిసి,ఎన్‌ఎఫ్‌ఎఐ, పివిఆర్‌, ఐనాక్స్‌లకు ధన్యవాదాలు తెలిపారు.

➡️