‘కన్నప్ప’లో అక్షయ్ షూట్‌ పూర్తి

మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘కన్నప్ప’ చిత్రంలో దక్షిణాది అగ్ర నటీనటులతో పాటు ఉత్తరాది హీరోలు కూడా నటిస్తున్నారు. ఇటీవలె బాలీవుడ్‌ నటుడు అక్షయ్ కుమార్‌ షూటింగ్‌లో పాల్గొన్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో అక్షయ్ కుమార్‌ తన పాత్ర సన్నివేశాల చిత్రీకరణను పూర్తి చేశారు. ఈ విషయమై విష్ణు మంచు సోషల్‌ మీడియాలో అక్షయ్ కుమార్‌తో కలిసి పనిచేసిన అనుభవాన్ని పంచుకున్నారు. ‘అక్షయ్ కుమార్‌తో కలిసి పనిచేయడం ఎంతో ఆనందంగా ఉందని, ఆయన నుంచి చాలా నేర్చుకున్నా’నని విష్ణు చెప్పారు. ప్రయాణం విలువైనది, మళ్లీ మళ్లీ ఇలాగే కలవాలని ఉందని తెలిపారు. మోహన్‌ బాబు నిర్మించిన ఈ చిత్రానికి ముఖేష్‌ కుమార్‌ సింగ్‌ దర్శకత్వం వహించారు. ఈ ప్రాజెక్ట్‌ షూటింగ్‌ చివరి దశకు చేరుకుంది. త్వరలో పూర్తి చేసి ప్రమోషన్‌ కార్యక్రమాన్ని విస్తృతం చేస్తామని చిత్రబృందం తెలిపింది.

➡️