మంచు విష్ణు ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ‘కన్నప్ప’ చిత్రం సెట్లోకి బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ అడుగు పెట్టారు. మోహన్ బాబు నిర్మాణంలో వస్తున్న ఈ చిత్రానికి మహాభారతం సీరియల్ ఫేమ్ ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. అత్యంత భారీ బడ్జెట్తో ఈ చిత్రం రూపొందుతోంది. ‘కన్నప్ప’ పాత్రలో మంచు విష్ణు నటిస్తుండగా ప్రభాస్, మోహన్ బాబు, మోహన్ లాల్, శివ రాజకుమార్, నయనతార, మధుబాల తదితరులు ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రంతో అక్షయ్ కుమార్ తెలుగు పరిశ్రమలోకి తొలిసారి అడుగుపెట్టబోతున్నారు.
