బాలీవుడ్‌ మూవీలో అలీ

Dec 4,2024 18:37 #Bollywood, #Film actor Ali, #movies

అలీ ప్రధాన పాత్రలో ‘వెల్‌కమ్‌ టు ఆగ్రా’ అనే హిందీ సినిమా రూపొందుతోంది. ఆశిష్‌ కుమార్‌ దూబే రచించి, దర్శకత్వం వహిస్తున్నారు. మ్యాడ్‌ ఫిలిమ్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై రూపొందుతున్న ఈ సినిమా ప్రారంభోత్సవంలో భాగంగా మొదటి సన్నివేశాన్ని ముంబైలో చిత్రీకరించారు. ఈ సందర్భంగా అలీ మాట్లాడుతూ ‘ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా కేంద్రంగా జరిగే ప్రేమకథే ఈ సినిమా. ఈ చిత్రంలో ప్రధాన పాత్రకి నన్ను ఎంచుకున్నందుకు దర్శక, నిర్మాతలకు కృతజ్ఞతలు. గతంలో హిందీలో క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా చేశాను. ఈ చిత్రంలో పూర్తి నిడివి ఉన్న పాత్ర చేస్తున్నాను. ఎంతో ఆనందంగా ఉంది’ అని తెలిపారు. ఈ మూవీలో అన్షుమాన్‌ ఝా, సారా అంజలి, ఆకాశ్‌ ధబాడే, రౌనక్‌ ఖాన్‌, ఫైజల్‌ మాలిక్‌, అంచల్‌ గాంధీ, కైరా చౌదరి తదితరులు నటిస్తున్నారు.

➡️