‘మా పెట్టుబడితో కొమరంపులి, ఖలేజా సినిమాలను తీసి తిరిగి మాకు ఇవ్వకుండా శింగనమల రమేష్‌బాబు మోసం చేశారు. మాతోపాటు ఇంకెందరో బాధితులు ఉన్నారు. ఫిలిం ఛాంబర్, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ వారు చిత్ర పరిశ్రమ నుంచి కూడా బహిష్కరించాలని డిమాండ్ చేస్తున్నాం. హైదరాబాద్ సివిల్ కోర్టులో అతనిపై కేసు నడుస్తోంది. క్రిమినల్ కేసు హైకోర్టులో అప్పీల్‌కు సిఐడితోపాటు మేము కూడా వెళ్లబోతున్నాం. మాకు న్యాయం జరిగే వరకూ అవిశ్రాంతంగా పోరాటం చేస్తాం. శింగనమల రమేష్‌బాబు మోసాలు, బెదిరింపులు, అక్రమాస్తులపై అతని బాధితులందరం తెలంగాణా సిఎం రేవంత్‌రెడ్డి, తమిళనాడు సిఎం స్టాలిన్‌ను కలుస్తాం’ అని ఫైనాన్సియర్స్ వైజయంతిరెడ్డి, ఆమె తరపున భర్త సదానంద్ చెప్పారు. హైదరాబాద్ సోమాజీగూడలోని ప్రెస్‌క్లబ్‌లో శనివారం ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో వారు పై విధంగా మాట్లాడారు.
