అల్లు అర్జున్‌ ఆర్యా సినిమాకి 21 ఏళ్ళు

2004లో విడుదలైన అల్లు అర్జున్‌ ‘ఆర్య’ మూవీ క్లాసిక్‌ లవ్‌ స్టోరీస్‌ లో ఒకటిగా నిలిచింది. డైరెక్టర్‌ సుకుమార్‌ కూడా తన తొలి చిత్రంతోనే ప్రేక్షకుల మనసును గెలుచుకున్నారు. ఇందులో అల్లు అర్జున్‌ జోడీగా సుకృతి కణుగంటి నటించారు. యాక్టర్‌ శివ బాలాజీ మరో కీలక పాత్ర పోషించారు. ఈ సినిమా విడుదలై నేటితో 21 సంవత్సరాలు పూర్తయింది. ఈ సందర్భంగా ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ మరోసారి ‘ఆర్య’ జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. ఎక్స్‌ లో ‘ఆర్య’ షూటింగ్‌ కి సంబంధించిన కొన్ని ఫొటోలను షేర్‌ చేశారు. ఆర్య కేవలం సినిమా కాదు, నా జీవితాన్ని శాశ్వతంగా మార్చిన ప్రయాణానికి నాంది. ఆ ప్రేమ, జ్ఞాపకాలు, ఇప్పటికీ జీవించి ఉన్నందుకు కృతజ్ఞతలు..  #21YearsForArya  అంటూ ట్వీట్‌ చేశారు.

➡️