Allu Arjun – మీ ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు : హీరో అల్లు అర్జున్‌

తెలంగాణ : మీ ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు అని హీరో అల్లు అర్జున్‌ కృతజ్ఞతలు తెలిపారు. శనివారం ఉదయం తన ఇంటి వద్ద మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ …. ”నాపై చూపుతున్న అభిమానానికి ధన్యవాదాలు. దేశవ్యాప్తంగా మద్దతిచ్చిన మీడియాకు కృతజ్ఞతలు. మృతి చెందిన రేవతి కుటుంబానికి అండగా ఉంటాం. సంధ్య థియేటర్‌లో జరిగింది అనుకోని ఘటన. అందులో నా ప్రమేయం లేదు. బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు ప్రయత్నిస్తున్నా. ఈ క్లిష్ట సమయంలో నాకు అండగా నిలిచిన ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు. మీ ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు. మీ అభిమానంతో నా హృదయం నిండింది. ” అని అన్నారు. సంధ్య థియేటర్‌ తొక్కిసలాట ఘటనకు సంబంధించి అరెస్టయిన హీరో అల్లు అర్జున్‌ ఈరోజు ఉదయం జైలు నుంచి విడుదలైన సంగతి విదితమే. మధ్యంతర బెయిల్‌ పై బయటకు వచ్చిన అర్జున్‌ను తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు దర్శక – నిర్మాతలు, హీరోలు కలిశారు. తొక్కిసలాట ఘటన, అరెస్ట్‌, తాజా పరిణామాల గురించి చర్చించారు. అనంతరం ఆయన ప్రెస్‌మీట్‌లో మాట్లాడారు.

➡️