బన్నీకి అమితాబ్‌ ప్రశంస

పుష్ప 2 సినిమాకు హిట్‌ టాక్‌ రావటంతో అల్లు అర్జున్‌ (బన్నీ)పై బాలీవుడ్‌ స్టార్‌ అమితాబ్‌బచ్చన్‌ ప్రశంసలు కురిపించారు. బన్నీ గతంలో మాట్లాడిన వీడియోను అమితాబ్‌బచ్చన్‌ షేర్‌చేశారు. ‘అల్లు అర్జున్‌ గారు నేనే మీ మాటలకు ఉప్పొంగిపోతున్నా. మీరు నాకు అర్హత కంటే ఎక్కువ క్రెడిట్‌ ఇస్తున్నారు. మేము మీ పని, అలాగే ప్రతిభకు పెద్ద అభిమానులం. మీరు మా అందరికీ స్ఫూర్తిని ఇస్తూనే ఉండండి. మీరు భవిష్యత్తులో కూడా ఇలాంటి విజయాలు ఎన్నో చూడాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. బంగారు భవిష్యత్తుకు ఆల్‌ ది బెస్ట్‌. మీరు ఇలాంటి సక్సెస్‌లు ఎన్నో అందుకోవాలి’ అంటూ తన ఎక్స్‌ ద్వారా తెలిపారు. ప్రస్తుతం ఈ పోస్ట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారుతోంది.

➡️