నేడు ‘అమ్మ’ షార్ట్‌ మూవీ విడుదల

May 10,2025 23:01 #telugu movies

ఎఎఆర్‌ ఫిలిం మేకర్స్‌ సమర్పణలో ‘నాట్యమార్గం’ సహకారంతో తెరకెక్కిన చిత్రం ‘అమ్మ’. ఆదివారం నాడు మదర్స్‌ డే సందర్భంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రముఖ నృత్యకారిణి అభినయశ్రీ ఇంద్రాణి ఈ చిత్రంలో ‘అమ్మ’ పాత్రలో నటించారు. ఆమె గతంలో నటించిన ‘అందెల రవమిది’ చిత్రం విడుదలకు ముందే పలు ప్రతిష్టాత్మక అవార్డులను సొంతం చేసుకుంది. ‘అమ్మ’లో ప్రధాన పాత్ర పోషించారు. ‘అమ్మ నిస్వార్ధ ప్రేమను, త్యాగాన్ని చూపే హృదయస్పర్శి కథ ఈ చిత్రం’ అని ఇంద్రాణి పేర్కొన్నారు. కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం వహించిన హరీష్‌ బన్నారు మాట్లాడుతూ ‘కొవ్వొత్తిలా కరిగి మనకు దారిచూపే అమ్మకు మనం ఏమిచ్చి రుణం తీర్చుకోగలం? ఇదే మా చిత్ర సందేశం’ అని పేర్కొన్నారు. ఈ చిత్రంలో ఇంద్రాణి దవలూరితోపాటు సాంబి, సుధా కొండపు, రీనా బొమ్మసాని తదితరులు నటించారు. కెవి భరద్వాజ్‌ సంగీతాన్ని సమకూర్చారు. కార్తీక్‌ కళ్లూరి సినిమాటోగ్రఫీ అందించారు.

➡️