అద్భుతమైన సినిమా ‘ఎ మాస్టర్‌ పీస్‌’

Jun 8,2024 19:58 #New Movies Updates

అరవింద్‌ కృష్ణ, మనీష్‌ గిలాడ, జ్యోతి పూర్వజ్‌, అషు రెడ్డి లీడ్‌ రోల్స్‌లో సుకు పూర్వజ్‌ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘ఏ మాస్టర్‌ పీస్‌’. ఫిల్మ్‌ ప్రొడక్షన్‌ స్టూడియో మెర్జ్‌ ఎక్స్‌ఆర్‌తో కలిసి సినిమా బండి ప్రొడక్షన్స్‌ పతాకంపై శ్రీకాంత్‌ కాండ్రేగుల, మనీష్‌ గిలాడ నిర్మిస్తున్న ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది. హైదరాబాద్‌లో ఈ సినిమా టీజర్‌ లాంచ్‌ ఈవెంట్‌ శనివారం జరిగింది. అరవింద్‌ కృష్ణ మాట్లాడుతూ, ‘ఏ మాస్టర్‌ పీస్‌’ మనం గర్వంగా చెప్పుకునే సూపర్‌ హీరో మూవీ అవుతుంది. నేను సినిమాలు వదిలేసిన సమయంలో నాలాంటి హీరో ఇండిస్టీలో ఉండాలని, నన్ను సినిమాలు చేయమని ప్రోత్సహించిన సుకుకు థ్యాంక్స్‌. ఓ సూపర్‌ హీరో క్యారెక్టర్‌కు మన పురాణాల నేపథ్యాన్ని జోడిస్తే మన నేటివ్‌ సూపర్‌ హీరో ఫిల్మ్‌ చేయొచ్చుననే ఆలోచనతో ‘ఏ మాస్టర్‌ పీస్‌’ సినిమాను ప్రారంభించాం.’ అని వివరించారు.

➡️