శరవేగంగా ‘గేమ్‌ ఛేంజర్‌’

May 29,2024 19:05 #movie, #Ram Charan

హీరో రామ్‌చరణ్‌ సినిమా ‘గేమ్‌ ఛేంజర్‌’ షూటింగ్‌ శరవేగంగా కొనసాగుతోంది. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’తో ఆయనకు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. ‘గేమ్‌ ఛేంజర్‌’ దాదాపుగా మూడేళ్ల నుంచి సెట్స్‌పైనే ఉంది. అక్టోబర్‌లో ఈ సినిమా విడుదలవుతుందని దిల్‌ రాజు కుమార్తె ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ సినిమా తర్వాత బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ఓ సినిమాలో రామ్‌చరణ్‌ నటించబోతున్నారు. ‘ఆర్‌సి16’ వర్కింగ్‌ టైటిల్‌. జాన్వీ కపూర్‌ హీరోయిన్‌. ఏఆర్‌ రెహమాన్‌ మ్యూజిక్‌. స్పోర్ట్స్‌ డ్రామాగా తెరకెక్కే ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తోంది.

➡️