కోలీవుడ్ నటుడు సూర్య కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘రెట్రో’ మే ఒకటో తేదీన విడుదల కానుంది. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పూజాహెగ్డే కథానాయిక. ఆ తర్వాత 45వ చిత్రంలో సూర్యకు జోడీగా త్రిషను ఎంపిక చేశారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ఎస్సార్ ప్రకాష్‌రాజ్, ఎస్సార్ ప్రభు నిర్మిస్తున్నారు. సాత్విక, యోగిబాబు, నట్టి ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సాయి అభయంకర్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమాలో అనఘారవిని ఎంపిక చేశారు. ఆమె ముఖ్యపాత్రలో నటిస్తున్నారు. ఆమె మలయాళంలో నటించిన అళపుళ జింఖానా చిత్రం గురువారమే విడుదలయ్యింది. ఈమె సూర్య చిత్రం ద్వారా కోలీవుడ్ ప్రేక్షకులను పలకరించబోతున్నారు. మమ్ముట్టి, జ్యోతిక కలిసి నటించిన ‘కాతల్’ సినిమాలో అనఘారవి వారికి కూతురిగా నటించింది. ఇందులో ఆమె నటనకు భారీగా ప్రశంసలు వచ్చాయి.
