”గేమ్‌చేంజర్’ చిత్రంలో నా పాత్ర పేరు పార్వతి. మా అమ్మ పేరు కూడా అదే. శంకర్ గారు ఈ చిత్ర కథ, నా పాత్ర గురించి చెప్పినప్పుడు మా అమ్మే గుర్తొచ్చారు. షూటింగ్‌లో నా నటను చూసి శంకర్ చాలా చోట్ల మెచ్చుకున్నారు. ఈ సినిమాలో నా పాత్ర చాలా ప్రత్యేకం. నేను నటించిన తమిళ చిత్రం మదగజరాజ సినిమా కూడా సంక్రాంతికే విడుదల కావటం ఎంతో సంతోషంగా ఉంది. గేమ్‌చేంజర్, మదగజరాజ ఈ రెండు చిత్రాలకు మంచి స్పందన వస్తుందనే నమ్మకం ఉంది. పార్వతి పాత్ర ప్రేక్షకులకు బాగా నచ్చుతుంది. నా కెరీర్‌లోనే ఇదే బెస్ట్ క్యారెక్టర్. ఈ పాత్రతో నాకు జాతీయ అవార్డు వస్తుందని అంటున్నారు. నా క్కూడా కథ విన్నప్పుడే అలానే అనిపించింది. అదే నిజమైతే అంతకంటే గొప్ప సక్సెస్ ఇంకేం ఉంటుంది’ అని నటి అంజలి అన్నారు. కథానాయకుడు రామ్‌చరణ్-దర్శకుడు శంకర్ కాంబినేషన్‌లో తెరకెక్కిన సినిమా ‘గేమ్‌చేంజర్’. అనిత సమర్పణలో దిల్ రాజు, శిరీష్ నిర్మించిన ఈ సినిమా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈనెల 10న విడుదల కానుంది. ప్రచార కార్యక్రమంలో భాగం అంజలి మీడియాతో పై విధంగా మాట్లాడారు.