‘కల్కి’ మరో రికార్డ్‌

Jun 18,2024 19:20 #movie, #prabhas

హీరో ప్రభాస్‌ నటించిన ‘కల్కి’ సినిమా ఈనెల 27న విడుదల కానుంది. సోమవారంనాడు ‘భైరవ ఏంథమ్‌’ పేరుతో ఓ పాటను చిత్రబృందం విడుదల చేసింది. మరోవైపు ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ గురించి టాక్‌ నడుస్తూనే ఉంది. ఇదంతా ఓవైపు నడుస్తుండగానే ‘కల్కి’ ఖాతాలో సరికొత్త రికార్డ్‌ చేరింది. కేవలం ఉత్తర అమెరికాలోనే 2 మిలియన్‌ డాలర్ల బిజినెస్‌ జరిగిపోయింది. రిలీజ్‌కి ముందు ఓ సినిమా ఇంతలా బిజినెస్‌ చేయడం ఇదే తొలిసారి అని మూవీ టీమ్‌ చెబుతోంది. ఒకవేళ సినిమా హిట్‌ టాక్‌ తెచ్చుకుంటే గనక రూ.1000 కోట్ల వసూళ్లు వచ్చిన ఆశ్చర్యపోనక్కర్లేదు. ఈ సినిమాలో దీపికా పదుకొణె, అమితాబ్‌ బచ్చన్‌, కమల్‌ హాసన్‌, దిశా పటానీ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. నాగ్‌ అశ్విన్‌ దర్శకుడు, సంతోష్‌ నారాయణన్‌ సంగీతాన్ని అందించారు.

➡️