ఆసుపత్రికి తరలింపు… అంతలోనే డిశ్చార్జి
చెన్నై : ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ అవార్డు గ్రహీత ఎ.ఆర్.రెహ్మాన్ అస్వస్థతకు గురికావడంతో ఆదివారం నాడిక్కడ ఓ ఆసుపత్రిలో చేరారు. ఆ తరువాత కొన్ని గంటల్లోనే డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని ఆయన సోదరి రిహానా తెలిపారు. ఆదివారం తెల్లవారుజామున అస్వస్థత కారణంగా రెహ్మాన్‌ను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. ఇటీవల సుదీర్ఘ ప్రయాణం చేయడం వల్ల రెహ్మాన్ వెన్ను నొప్పి, డీహ్రైడేషన్‌కు గురయ్యారని, ప్రస్తుతానికి ఆరోగ్యం కుదుటపడిందని ఆయనకు వైద్యం అందించిన డాక్టర్ల బృందం తెలిపింది. రెహమాన్ క్షేమంగా ఉన్నారని వైద్యులు సంతోషకరమైన వార్త చెప్పారని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ సోషల్ మీడియా పోస్ట్‌లో పేర్కొన్నారు.