హాలీవుడ్‌ రేంజ్‌లో

యువ దర్శకుడు ప్రశాంత్‌ వర్మ అగ్రశ్రేణి ఆర్కిటెక్ట్‌ల పర్యవేక్షణలో ఓ పెద్ద భవనాన్ని తన ఆఫీస్‌గా తీర్చిదిద్దుతున్నారు. ప్రపంచ స్థాయి సౌకర్యాలతో పాటు, సినిమాకి సంబంధించి ఏ టూ జెడ్‌ ప్రతి విషయం అక్కడ నుంచి ఆపరేట్‌ అయ్యే విధంగా అడ్వాన్స్‌ టెక్నాలజీతో రూపొందిస్తున్నారు. స్టోరీ డిస్కషన్‌ దగ్గర నుంచి సెట్స్‌కి వెళ్లే వరకూ ప్రాజెక్ట్‌కి సంబంధించిన పనులన్నీ అదే ఆఫీస్‌లో పూర్తయ్యే విధంగా దీన్ని నిర్మిస్తున్నారు. జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, చెన్నై, ముంబై తిరగకుండా తన ఐడియాలజీ, విజన్‌కి తగ్గట్లు అన్ని సౌకర్యాలు ఒకే చోట ఉండే విధంగా రెడీ చేస్తున్నారు. రైటర్స్‌ టీమ్‌, విఎఫ్‌ ఎక్స్‌ టీమ్‌, పీవీసీయూ ఉద్యోగులు ఇలా అందర్నీ ఒకే తాటిపైకి తీసుకొచ్చి తన ఆఫీసు నుంచే పని చేయించేలా వాళ్లకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఈ ఆఫీస్‌ వుంటుందని సమాచారం. ఈ రేంజ్‌లో ఇంత వరకూ టాలీవుడ్‌లో ఏ దర్శకులకు ఆఫీసు లేదు. టాలీవుడ్‌లో ఖరీదైన సినిమా ఆఫీస్‌ అంటే, పూరి జగన్నాథ్‌ కట్టించుకున్న ‘కేవ్‌’ గుర్తొస్తుంది. ఇప్పుడా కేవ్‌ని మించి ప్రశాంత్‌ వర్మ సినిమా ఆఫీస్‌ ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

➡️