మల్టీస్టార్స్‌తో ‘అట్లీ’ సినిమా

తమిళ దర్శకుడు అట్లీ తాజాగా మల్టీస్టారర్‌తో సినిమా చేయనున్నారు. ఇటీవల ఆయన తీసిన ‘జవాన్‌’ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపుపొందాడు. ప్రస్తుతం ఆయన తదుపరి చిత్రం గురించే ఎక్కువ చర్చ నడుస్తోంది. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో అట్లీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దళపతి విజయ్, షారుక్‌తో ఓ మల్టీస్టారర్‌ చిత్రం తీసేందుకు రెడీ అవుతున్నట్లు చెప్పారు. ‘ప్రస్తుతం ఈ మలీస్ట్టారర్‌ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్‌ వర్క్‌ తో బిజీగా ఉన్నాం. త్వరలోనే ఇది తెరకెక్కే అవకాశాలున్నాయి’ అని వెల్లడించారు. తాజాగా ఓ పార్టీలో విజరు, షారుక్‌ ఖాన్‌ నా సినిమాల గురించి మాట్లాడుకొని నాకు ఫోన్‌ చేశారు. మల్టీస్టారర్‌ తీసే ఆలోచన ఉంటే.. అందులో తాను నటించడానికి ఆసక్తిగా ఉన్నట్లు షారుక్‌ చెప్పారు. అలాగే విజరు కూడా ఇదే మాట అన్నారు. అందుకే వాళ్లిద్దరితో ఓ మల్టీస్టారర్‌ చేయాలని నిర్ణయించుకున్నా. ఇదే నా తదుపరి చిత్రం అవుతుంది. రూ.3000 కోట్లు వసూళ్లు చేసే చిత్రమవుతుంది. ఈ ఇద్దరిలో ఎవరు ముఖ్యమంటే నేను చెప్పలేను. ఈరోజు నేను ఈ స్థాయిలో ఉండడానికి తొలి కారణం విజరు.. నాపై నమ్మకంతో అవకాశాలిచ్చారు’ అని అట్లీ అన్నారు. అంతేకాదు హాలీవుడ్‌ నుంచి ఓ ప్రముఖ స్టూడియో తనను సంప్రదించినట్లు, ప్రస్తుతం ఆ పనులు కూడా జరుగుతున్నట్లు అట్లీ చెప్పారు.

➡️