బాలకృష్ణ, నేను కలిసి ప్రాంక్‌ చేసేవాళ్లం : చాందినీ చౌదరి

Jun 11,2024 12:54 #Balakrishna, #movie

ఇంటర్నెట్‌డెస్క్‌ : ప్రముఖ నటుడు బాలకృష్ణ, దర్శకుడు బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీలో కలర్‌ఫొటో హీరోయిన్‌ చాందినీ చౌదరి కీలకపాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ కూడా శరవేగంగా జరుగుతోంది. జూన్‌ 10వ తేదీన బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా మూవీ మేకర్స్‌ ‘ఎన్‌ బి కె 109’ పేరుతో గ్లింప్స్‌ను విడుదల చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా చాందినీ చౌదరి ఓ ఇంటర్వ్యూలో పాల్గొని మూవీ విశేషాలను పంచుకున్నారు. సినిమా సెట్‌లో బాలకృష్ణతో తాను గడిపిన క్షణాలను గుర్తు చేసుకున్నారు. ‘ఈ సినిమా దాదాపు యాభై శాతం షూటింగ్‌ పూర్తయింది. ఈ చిత్రంలో నేను కీలక పాత్రలో నటిస్తున్నాను. మూవీ సెట్‌లో బాలకృష్ణ అందరితో సరదాగా ఉంటారు. నేను, ఆయన కలిసి అందరి మీద ప్రాంక్స్‌ కూడా చేసేవాళ్లం.’ అని చాందినీ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
కాగా, బాలకృష్ణ పుట్టినరోజు సందర్బంగా చాందినీ బాలకృష్ణతో కలిసి దిగిన ఫొటోను సోషల్‌మీడియా ద్వారా పోస్టు చేసి.. ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

➡️