నటీనటులు నవీన్ పోలిశెట్టి, శ్రీలీలతో సీనియర్ నటుడు నందమూరి బాలకృష్ణ సరదాగా చిట్‌చాట్ నిర్వహించారు. అన్ స్టాపబుల్ విత్ ఎన్‌బికె సీజన్ 4 ఆహా తాజా ఎపిసోడ్‌లో ఆయన అడిగిన ప్రశ్నలకు నవీన్ పోలిశెట్టి, శ్రీలీల సరదాగా సమాధానాలు ఇచ్చారు. తమ నటనతోపాటుగా చిత్రసీమకు సంబంధించిన విషయాలు, కొత్త సినిమాల సంగతులు పంచుకున్నారు. నవీన్ తన కొత్త ప్రాజెక్టు అనగనగా ఒక రాజు గురించిన విషయాల గురించి ప్రస్తావించారు. పుష్ప 2లో తన రోల్ గురించి చెప్పటంతోపాటు శ్రీలీల డ్యాన్స్ చేసి ఆకట్టుకున్నారు. ఆఖరిగా బాలకృష్ణ తాను సినిమా ఎంపిక విషయానికి వస్తే రాజమౌళి చిత్రంలో హీరోగానూ, సందీప్ వంగాతో చేసే సినిమాలో విలన్‌గా నటించ టానికి ఇష్టపడతానంటూ ప్రకటించారు.
