సిఎం చంద్రబాబుతో బాలకృష్ణ ‘అన్‌స్టాపబుల్‌ సీజన్‌-4’

హీరో నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న అన్‌స్టాపబుల్‌ సీజన్‌-4 మొదటి ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోను ఓటీటీ వేదిక ఆహా విడుదల చేసింది. ముఖ్యఅతిథిగా హాజరైన సిఎం నారా చంద్రబాబు పలు ఆసక్తి కరమైన విషయాలను పంచుకున్నారు. ఇప్పటికే మూడు సీజన్లు పూర్తిచేసుకున్న ఈ షో నాలుగో సీజన్‌కు సిద్ధమైంది. ఈనెల 25 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. ఈ సీజన్‌లో మొదటి అతిథిగా చంద్రబాబు వచ్చి సందడి చేశారు. దీనికి సంబంధించిన ప్రోమోను ఆహా విడుదల చేసింది. ఈ సందర్భంగా షోకు వచ్చిన సిఎం చంద్రబాబుతో బాలకృష్ణ ప్రమాణం చేయించారు. చంద్రబాబు అరెస్ట్‌, జైలులో గడిపిన క్షణాలను ఈ ఎపిసోడ్‌లో పంచుకున్నట్లు ప్రోమోలో చూపించారు.

➡️