‘డాకూ మహారాజా’గా బాలయ్య..!

Nov 9,2024 20:25 #Hero Balakrishna, #movies, #new movie

బాలకృష్ణ హీరోగా నటిస్తున్న 109 సినిమా ‘ఎన్‌బికె 109’ టైటిల్‌తో షూటింగ్‌ జరుగుతోంది. దసరాకు టైటిల్‌, దీపావళికి టైటిల్‌ రివీల్‌ చేస్తామని గతంలో మేకర్లు ప్రకటించినా జరగలేదు. ఈసినిమా షూటింగ్‌ డిసెంబర్‌లో పూర్తి కావాల్సివుంది. ఇంకో రెండు, మూడు కీలక భాగాలను షూట్‌ చేయాల్సివుందని ఇటీవల చిత్ర యూనిట్‌ ప్రకటించింది. మరోవైపు బాలకృష్ణ, బోయపాటి శ్రీనివాస్‌ కాంబినేషన్‌లో ‘అఖండ తాండవానికి’ సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రం కోసం ‘డాకూ మహారాజా’, ‘సర్కార్‌ సీతారామ్‌’ టైటిళ్లు పరిశీలనలో ఉన్నట్లుగా సమాచారం. ‘డాకూ మహారాజా’ పేరునే ఖరారు చేసే అవకాశాలు ఉన్నట్లుగా తెలిసింది.

➡️