ఓటీటీ టాక్ షో ‘అన్ స్టాపబుల్’ మూడో సీజన్ త్వరలో ప్రారంభంకానుంది. తాజాగా దీనికి సంబంధించన అప్డేట్‌ని ఆహా సంస్థ ప్రకటించింది. ఈ మూడో సీజన్ మొదటి ఎపిసోడ్‌కి దుల్కర్ సల్మాన్ రానున్నారు. ఆయన నటిస్తున్న ‘లక్కీ భాస్కర్’ చిత్ర ప్రమోషన్లలో భాగంగా ఈ కార్యక్రమం జరగనుంది. దుల్కర్‌తో పాటుగా, చిత దర్శకుడు వెంకీ అట్లూరి, నిర్మాత నాగవంశీలు పాల్గొనబోతున్నారు.